మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ తో పాటు వార్డు ప్రజలు
మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ తో పాటు వార్డు ప్రజలు
తెలుగు గళం న్యూస్, పరకాల,అక్టోబర్ 24
పరకాల పట్టణ ప్రజల సౌకర్యం కోసం,భారీ వర్షాలు కారణంగా రోడ్లపైకి వరదనీరు రాకుండా ఉండేందుకు,ముంపు ఏరియాలలో వరదలు లేకుండా ఉండేందుకు పరకాల పట్టణంలో నూతన డ్రైనేజీల నిర్మాణం కోసం టీయూఎఫ్ఐడిసీ నిధులతో డ్రైనేజీల నిర్మాణం పనులు జరుగుతుండగా ఈరోజు ఉదయం ఒకటో వార్డులో మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ జరుగుతున్న పనులను మరియు జరిగిన పనులను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్బంగా మడికొండ సంపత్ కుమార్ మాట్లాడుతూ టీయూఎఫ్ఐడిసీ ద్వారా సుమారు 15 కోట్లు నిధులు మంజూరు చేయించిన స్థానిక శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డికీ ఒకటో వార్డు ప్రజల పక్షాన మరియు మడికొండ సంపత్ కుమార్ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు.