జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్
జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్
తెలుగు గళం న్యూస్, పరకాల, అక్టోబర్ 25
ఈరోజు ఎస్ఎఫ్ఐ పరకాల కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. లిటిల్ ఫ్లవర్ స్కూల్ శారద హై స్కూల్ లో ఈ కార్యక్రమాన్ని
నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ లను విడుదల చేయాలని అదేవిధంగా పరకాల పట్టణంలో ఉన్న ఎస్ఎమ్ఎచ్ హాస్టల్ కు సొంత భవనాలు నిర్మించాలని కోరారు.ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని పరకాల పట్టణంలో సోషల్ వెల్ఫేర్ ఎస్సీ బాయ్స్ హాస్టల్ ను నియమించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు కార్యదర్శి ప్రేమ్, పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ పట్టణ కార్యదర్శి సాయి తేజ, విద్యార్థులు పాల్గొన్నారు.