పరకాల పట్టణంలో రోడ్లపై పశువుల సంచారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.పరకాల బస్ స్టాండ్ కూడలిలో సాయంత్రం అయితే చాలు బడి పిల్లలు ఇంటికి వచ్చినట్లుగా రోడ్లమీదకి వచ్చి రోడ్లమీద బైక్ లు గాని బస్సులు గాని వెళ్లే దారిలో నిర్భయంగా పడుకుంటాయి.చాలా సార్లు తీవ్రంగా ప్రమాదాలు కుడా జరిగాయి. చాలా మంది కమిషనర్లు వచ్చారు వెళ్లారు కానీ ఈ సమస్యని మాత్రం పరిష్కారం చేయలేదు. ప్రస్తుత కమిషనర్ వచ్చి వాటిని రోడ్లమీద నుంచి పంపించారు మళ్ళీ అవి రోడ్లమీదకి వస్తే పెంపకదారులపై చర్యలు తీస్కుంటామని వెళ్లారు కానీ అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి.ఇబ్బంది కలిగించే పశువులు వల్ల ప్రమాదాలు జరుతున్నాయి.మున్సిపల్ అధికారులు ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.