పర్యాటక కేంద్రంగా బుగులోని గుట్టలను అభివృద్ధి చేస్తా
Jayashankar Bhupalpally, Telangana, TELUGU NEWSరేగొండ ప్రాంతాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.సోమవారం సాయంత్రం మండలంలోని తిరుమలగిరి శివారులోని బుగులోని గుట్టల వద్ద జాతర అభివృద్ధి పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ జాతర అభివృద్ధి పనుల కోసం కోటి 60 లక్షల రూపాయల నిధులను కేటాయించినట్లు తెలిపారు.ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న జాతర అభివృద్ధి కోసం ఫారెస్ట్ అధికారులను ఒప్పించి పనులు చేస్తున్నట్లు తెలిపారు.నాలుగు కోట్ల రూపాయల నిధులతో జగ్గయ్యపేట నుండి బుగులోని జాతర వరకు, నారాయణపురం నుండి,జూబ్లీ నగర్ నుండి జాతర వరకు బీటి రోడ్లు నిర్మించేందుకు ఇప్పటికే శంకుస్థాపన చేశామని తెలిపారు,త్వరలోనే పనులు పూర్తి చేయిస్తానని అన్నారు.పాండవుల గుట్టలు,బుగులోని జాతర,కొడవటంచ (కోటంచ) లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు.ఇప్పటికే టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఈ ప్రాంతానికి తీసుకువచ్చి అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని కోరినట్లు తెలిపారు.ముఖ్యమంత్రి సహకారంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కంజర్వేటర్ ప్రభాకర్,డీఎఫ్ఓ నవీన్ రెడ్డి,తాసిల్దార్ శ్వేతారావు, ఎంపీడీవో వెంకటేశ్వర్ రావు,ఎంపీఓ రాంప్రసాద్,మార్కెట్ కమిటీ చైర్మన్ గుంటొజు కిష్టయ్య,పిఎసిఎస్ చైర్మన్ నడిపల్లి విజ్జన్ రావు,ఎన్ఎస్ఆర్ సంస్థల చైర్మన్ నాయినేని సంపత్ రావు, బుగులోని జాతర చైర్మన్ రొంటాల వెంకటస్వామి,కోడవటంచ ఆలయ చైర్మన్ ముల్కనూరు బిక్షపతి,జిల్లా నాయకులు మోడమ్ ఉమేష్ గౌడ్, పున్నం రవి,పట్టెం శంకర్,కట్ల చిన్ని, నాయకులు గంగుల రమణారెడ్డి, నిమ్మల విజేందర్,పల్నాటి శ్రీనివాస్, ముడతనపల్లి శంకరయ్య, వావిలాల రమేష్,మేకల బిక్షపతి, బొజ్జం రవి,ఏనుగు రవీందర్ రెడ్డి, అధిక సంఖ్య లో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.