ఈ69న్యూస్ వరంగల్:పర్వతగిరి మండలంలో అక్రమ ఇసుక రవాణా పట్టపగ్గం లేకుండా సాగుతోంది.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పేర్లతో వందల ట్రిప్పుల ఇసుక తరలింపు జరగుతుండగా,ఒక్కో ట్రాక్టర్కు రూ.2,000 చొప్పున మామూలు వసూలు చేస్తూ ఓ సిండికేట్ వ్యవస్థ వృద్ధిచెందుతోంది.రోల్లకల్,నారాయణపురం వాగుల్లోనుంచి ఇసుక తరలింపు రోజంతా సాగుతుండగా,అధికారులు చూసి కూడా లెక్కచేయడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రెండు వందల ట్రిప్పుల ఇసుకను అక్రమంగా డంప్ చేసి,అధిక ధరలకు అమ్మకానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం."ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హెచ్చరిక:'ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుక దందా చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పారదర్శకంగా ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు."తహసిల్దార్ వెంకటస్వామి స్పందన":అక్రమ నిలువలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, డంపింగ్ చేసిన ఇసుకను స్వాధీనం చేసి లబ్ధిదారులకు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.