పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించిన సీపీఎం నేతలు–ప్రజా సమస్యలపై వినతి ఈ69న్యూస్ జనగామ:ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆదివారం సీపీఎం జిల్లా నాయకులు హైదరాబాద్లో కలిసి పరామర్శించారు.నియోజకవర్గంలోని డ్రైనేజీ,సీసీ రోడ్లు,వీధిదీపాలు,మంచినీటి కష్టాలు వంటి అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.వర్షాభావం తీవ్రంగా ఉండటంతో చెరువులు,కుంటలు వాడిపోగా,రైతులు నాట్లు వేయలేని పరిస్థితి నెలకొందన్నారు.దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీరు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.గనుగుపహాడ్ వాగుపై బ్రిడ్జి పనులు పూర్తికాలేదని,ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని,అలాగే చీటకోడూరు వంతెన పూర్తిగా ధ్వంసమై మూడేళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించలేదని పేర్కొన్నారు.ఇందిరమ్మ హౌసింగ్ లబ్ధిదారులకు ఇంటి నంబర్లు,మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.కార్యక్రమంలో సీపీఎం నేతలు మోకు కనకారెడ్డి,బూడిద గోపి,జోగు ప్రకాష్,సుంచు విజేందర్,సాంబరాజు యాదగిరి పాల్గొన్నారు.