పామిడి లో ఘనంగా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ ఈ69 న్యూస్, పామిడి:పాకిస్తాన్‌పై భారత సైన్యం విజయాన్ని సాధించిన ఆపరేషన్ సింధూరం విజయోత్సవాన్ని పురస్కరించుకొని పామిడిలో 300 అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గుత్తి మాజీ ఎమ్మెల్యే కోట్రికే మధుసూదన్ గుప్తా, తహసిల్దార్ శ్రీధర్ మూర్తి, ఎంపీడీవో తేజోష్ణ పాల్గొని సైనికుల త్యాగాలను ప్రస్తావించారు. జయహో భారత్ నినాదాలతో పట్నం మార్మోగగా, వేలాది మంది జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు.