ఈ69న్యూస్ పాలకుర్తి జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో వర్షాభావం కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిను హైదరాబాద్లో కలిసి వినతి పత్రం సమర్పించారు.నియోజకవర్గానికి తక్షణంగా నీటిని విడుదల చేయాలని కోరారు.అలాగే నిర్మాణంలో ఉన్న చెన్నూరు రిజర్వాయర్ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అభ్యర్థించారు.ఈ అంశంపై మంత్రి సమీక్ష నిర్వహించి,తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఎమ్మెల్యే ఈ చొరవను రైతులు అభినందిస్తున్నారు.