
ఈ69 న్యూస్ జనగామ/పాలకుర్తి
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో చెరువులు,కుంటలు,రిజర్వాయర్ల భూములు రియల్ ఎస్టేట్ ఆక్రమణలకు గురవుతున్నాయని ఆరోపిస్తూ,తెలంగాణ రైతు సంఘం నాయకులు తహసిల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ మాట్లాడుతూ..ప్రతి చెరువుకు బఫర్ జోన్,ఎఫ్టిఎల్ స్థాయిలు నిర్ణయించి గజెట్లో ప్రకటించాలని,ఆక్రమణలు వెనక్కు తీసుకోవాలని,ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.సంబంధిత ప్రభుత్వ జి.ఓ 111,ఎన్జీటి మార్గదర్శకాలు,టిఎస్డబ్ల్యుఆర్ 2020 ప్రకారం నీటి వనరుల రక్షణ తప్పనిసరి అని చెప్పారు.అవసరమైతే గ్రామస్థాయిలో ఉద్యమాలు చేస్తామంటూ హెచ్చరించారు.