
పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలి-స్వేరో స్టూడెంట్స్
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులపై విధించిన అధిక ఫీజులను వెంటనే తగ్గించాలని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్ చేసింది.ఈ సందర్భంగా మంగళవారం హనుమకొండ అశోక జంక్షన్ వద్ద జిల్లా ఎస్ ఎస్ యు ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ..గతంలో రిజిస్ట్రేషన్ ఫీజు ₹80,ఇతర యూనివర్సిటీ ఛార్జీలు ₹1300 మాత్రమే ఉండేవి.ఇప్పుడు యూనివర్సిటీ ₹3250 వరకు పెంచడం పేద విద్యార్థులకు భారమవుతోంది.ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థులలో ఎక్కువగా బడుగు,బలహీన వర్గాలకు చెందిన వారు.ఈ భారీ ఫీజులు చెల్లించడం వారికి సాధ్యం కాదు అని పేర్కొన్నారు.అలాగే,తక్షణమే ఫీజులను తగ్గించాలని,లేనిపక్షంలో యూనివర్సిటీ పరిపాలన భవనం ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చెట్టుపల్లి శివకుమార్,కార్యదర్శి ఉల్లే రావుబాబు,కాకతీయ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు రాజ్‌కుమార్,నాగరాజు,కార్తీక్,శ్రీరామ్,చరణ్,మహేష్,పవన్,సునీల్,శ్రావణ్,యశ్వంత్,గణేష్,శ్రీనాథ్,అలాగే విద్యార్థినులు కీర్తన,లయకరి,ఝాన్సీ,నవ్య,శృతి,యశ్వంతి,శాలిని,రవళి,బిందు తదితరులు పాల్గొన్నారు