పేకాట దందా భగ్నం 7 మంది అరెస్ట్
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న గ్యాంగ్‌పై పోలీసులు దాడి చేసి 7 మందిని అరెస్ట్ చేశారు.నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై జానీ పాషా ఆధ్వర్యంలో పోలీసులు దాడి జరిపి,నగదు,బైకులు,మొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడినవారు-రౌండీ శ్రీను (తండ్రి రాజయ్య),ఎత్తరి రాజు (తండ్రి ఎల్లయ్య,మడికొండ),ఆవుల కుమారస్వామి (తండ్రి ఒదాయా),ఓర్సు శ్రీనివాస్ (తండ్రి వెంకటయ్య),వల్లెపు రాజు (తండ్రి రాములు),బొడ్డు జయధీర్ (తండ్రి ఆరోగ్యం),బోడ పట్ల రంజిత్ (తండ్రి కుమార్,సాయిపేట గ్రామం). వీరిలో మిగతా వారంతా ధర్మసాగర్ గ్రామానికి చెందినవారే.స్వాధీనం చేసుకున్న వస్తువులు-ప్లేయింగ్ కార్డులు-104,నగదు రూ.1,18,400,బైకులు-4,స్మార్ట్ మొబైళ్లు 7.ఈ ఆపరేషన్‌లో ఎస్సై నరసింహారావు,ఎస్సై దిలీప్,సిబ్బంది సంజయ్ కుమార్,రాఘవేందర్,మహబూబ్ పాషా పాల్గొన్నారు.పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై జానీ పాషా తెలిపారు.