(ఈ69న్యూస్ – జూలై 29, వేలేరు):వేలేరు మండల కేంద్రానికి చెందిన ఆక్రోమేగాలి అనారోగ్యంతో బాధపడుతున్న నోముల ప్రతాప్‌కు చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం మాజీ సర్పంచ్ విజయపురి మల్లికార్జున్ ద్వారా ఎమ్మెల్యే డాక్టర్ కడియం శ్రీహరి దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2,50,000/- విలువైన ఎల్వోసి మంజూరు చేయించారు. లబ్ధిదారులు ఎమ్మెల్యేకు మరియు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, "కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఆరోగ్యశ్రీలో కవర్ కాని చికిత్సలకూ, అత్యవసర వైద్యం అవసరమైన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోంది" అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నిధి వల్ల ఎందరో పేద ప్రజల ప్రాణాలు కాపాడబడుతున్నాయని ఆయన వెల్లడించారు.