
పేదల సొంతింటి కల
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను అందజేసిన పరకాల ఎమ్మెల్యే రేవూరి బుధవారం హనుమకొండ భవాని నగర్ లోని తన నివాసం నందు 17వ డివిజన్ పరిధిలోని అర్హులైన 43 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేద ప్రజల సొంతింటి కల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతుందని,అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు.పారదర్శకంగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక జరిగిందని ప్రలోభాలకు, పైరవీలకి తావు ఉండదు అని అన్నారు.ప్రభుత్వం సూచించిన నిబంధన మేరకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకోవచ్చని అన్నారు.గత ప్రభుత్వ పాలకుల నిర్వాహకం వల్ల ధనిక రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని అన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వద్దని, ఎవరైనా తీసుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారుఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను అందుకున్న లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని అన్నారు