పేద కుటుంబానికి సాయం చేసిన బీజేపీ నాయకులు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని జఫర్ఘడ్ మండల కేంద్రానికి చెందిన భాషబోయిన అంజయ్య ఇటీవల మరణించగా,బీజేపీ నాయకులు సోమవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు.బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు,కాంటెస్టెడ్ ఎమ్మెల్యే,మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జీ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు దివంగత అంజయ్య కుటుంబసభ్యులను ఓదార్చి,వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.మానవత్వంతో ముందుకు వచ్చి,ఆ కుటుంబానికి 50 కిలోల రైస్ బ్యాగ్‌ను అందజేశారు.ఈ కార్యక్రమంలో పెరుమాండ్ల వెంకటేశ్వర్లు(వెంకన్న)తో పాటు మైనార్టీ మోర్చా జనగామ జిల్లా అధ్యక్షులు ఎండి.వలి పాషా,కిసాన్ మోర్చా హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు దుస్స రాములు,ఎస్సీ మోర్చా జఫర్ఘడ్ మండల అధ్యక్షులు గాదెపాక శ్రీను,బీజేవైఎం మండల అధ్యక్షులు తాళ్ళపల్లి సురేష్ గౌడ్,సీనియర్ నాయకులు ఎదులాపురం జయశంకర్,కాల్వ రవి,మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు యాక లక్ష్మీ,కొమ్మాల గ్రామ బూత్ అధ్యక్షులు వల్లాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.మృతుని కుటుంబానికి నాయకులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.