పేద విద్యార్థినికి ఐదువేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన అన్నం బ్రహ్మా రెడ్డి ఈ69న్యూస్ జఫర్గడ్,జూలై 11:మండల కేంద్రమైన జఫర్గడ్లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు చెందిన పేద విద్యార్థిని యాతం సంధ్యారాణికి ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్నిమాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి అందించారు.ఈ సహాయాన్నిశుక్రవారం మాజీ ఎంపీటీసీలు ఇల్లందుల స్రవంతి,మొగిలి బాదావత్ దేవేందర్ నాయక్ చేతుల మీదుగా విద్యార్థినికి అందజేశారు.ఇంటర్మీడియట్ ఫలితాల్లో మండల స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి,ఎంసెట్‌లోనూ మెరుగైన ప్రతిభ కనబరిచిన సంధ్యారాణి పై తరగతులలో చేరేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిన అనంతరం,అన్నం బ్రహ్మారెడ్డి తనవంతు సహాయం అందించారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయినీల సమక్షంలో ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్.స్వప్న అన్నం బ్రహ్మారెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు కాట సుధాకర్,కుక్కల ఎల్లయ్యతో పాటు పాఠశాల ఉపాధ్యాయినీలు పాల్గొన్నారు.