వరంగల్ ఇంతే జార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాలకి చెందిన ఏడుగురు వ్యక్తులు గత కొన్ని రోజుల్లో తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు తక్షణమే చర్యలు ప్రారంభించారు.ఇంతే జార్ గంజ్ ఇన్స్పెక్టర్ ఎం.ఎ.శుకూర్ మార్గదర్శకత్వంలో,ఎస్.ఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సిఇఐఆర్ పోర్టల్ ను ఉపయోగించి ఆ మొబైల్ ఫోన్లను ట్రాక్ చేశారు.ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని,క్రమపద్ధతిలో అన్వేషణ జరిపి మొత్తం 7 మొబైల్ ఫోన్లు గుర్తించి తిరిగి యజమానుల చెంతకు చేర్చారు.ఈ చర్యలో ఆన్లైన్ రైటర్ సందీప్,క్రైమ్ కానిస్టేబుల్ దీపక్ కీలక పాత్ర పోషించారు.వీరి కృషిని గుర్తించిన ఇన్స్పెక్టర్ శుకూర్ వారిని ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు.పోలీసుల ఈ చొరవపై మొబైల్ ఫోన్లు తిరిగి పొందిన బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ,పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.ఇన్స్పెక్టర్ శుకూర్ మాట్లాడుతూ..ప్రజలు తమ సెల్ఫోన్లు పోగొట్టుకున్న సందర్భంలో సిఇఐఆర్ పోర్టల్ ఎంతో ఉపయోగకరమైన సాధనం.ప్రతి ఒక్కరు తమ ఫోన్ల ఐఎంఇఐ నంబర్ వివరాలను భద్రపరచుకోవాలి.ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే తక్షణ చర్యలు తీసుకుంటాం”అని తెలిపారు.