తెలుగు గళం, పరకాల, ఆగస్టు 27హనుమకొండ జిల్లా. పరకాల పట్టణంలోని పద్మశాలి సంఘం మరియు పద్మశాలి పోప ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ. పద్మశాలి పోప సంగం అధ్యక్షులు డాక్టర్ రాజేశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ దాదాపు 9 సంవత్సరాలుగా మట్టి గణపతులను కోప సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మట్టి విగ్రహాలను వాడడం వలన పర్యావరణ పరిరక్షణ హాని జరగకుండా చెరువులు కుంటలు కలుషితం కాకుండా వాతావరణాన్ని సమతుల్యంగా ఉండేవిధంగా ఉంటుందన్నారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడడంతో చెరువులు కుంటలలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసిన తర్వాత వాటి అవశేషాలతో పంటలు కలుషితమై రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. కాబట్టి మట్టి విగ్రహాలను పూజించాలన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.