పోయిన మొబైల్ ని గుర్తించిన పోలీసులు
సి ఈ ఐ ఆర్ సాయంతో పోయిన మొబైల్‌ను గుర్తించిన పోలీసులు కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్‌ఫోన్ కోల్పోయిన బాధితునికి పోలీసులు సత్వర చర్యలతో సహాయం చేసి మొబైల్‌ను తిరిగి అందజేశారు.బాధితుడు సురేష్,నర్సంపేట నివాసి,ఇటీవల మేడారం జాతరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.సురేష్ తన ద్విచక్ర వాహనంపై రేగొండ నుంచి జాకారం వైపు ప్రయాణిస్తుండగా, సుల్తాన్పూర్ గ్రామం పరిధిలో మొబైల్ ఫోన్ అనుకోకుండా జారిపడింది. అనంతరం బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, అధికారులు కేసును నమోదు చేసి కేంద్ర ప్రభుత్వ సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా మొబైల్‌ను ట్రాక్ చేయడం ప్రారంభించారు.సాంకేతిక ఆధారాల ఆధారంగా మొబైల్ ఫోన్ ఆచూకీని గుర్తించి అది ఒంగోలు జిల్లాలో ఉన్నట్టు ధృవీకరించారు. సంబంధిత ప్రాంత పోలీసులతో సమన్వయం చేసి మొబైల్‌ను స్వాధీనం చేసుకుని,ఎస్సై సాకపురం దివ్య ఆధ్వర్యంలో బాధితునికి అధికారికంగా తిరిగి అప్పగించారు.ఈ సందర్భంగా ఎస్సై దివ్య మాట్లాడుతూ, ప్రజలు మొబైల్ ఫోన్లు కోల్పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుంటే, సాంకేతిక సహాయంతో వాటిని గుర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.కార్యక్రమంలో కానిస్టేబుల్ హరీష్ సహా సిబ్బంది పాల్గొన్నారు.పోలీసుల వేగవంతమైన చర్యలకు బాధితుడు సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు కూడా పోలీసుల సేవలను అభినందించారు.