పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్,అలైవ్ కార్యక్రమం
ఆటో డ్రైవర్లు కు కంటి పరీక్షల నిర్వహణ. మహబూబాబాద్ జిల్లా మారిపెడ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు వాహనదారుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
మారిపెడ సీఐ రాజ్ కుమార్ గౌడ్, ఎస్సై వీరబద్రం మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వారు స్వయంగా కంటి పరీక్షలు చేయించుకుని, రోడ్డు భద్రతలో శారీరక ఆరోగ్య ప్రాముఖ్యతను తెలియజేశారు,అలాగే ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని వైద్యులు సూచించారు,ఈ శిబిరంలో కంటి వైద్యులు పాల్గొని డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించగా, అవసరమైన వారికి కంటి అద్దాలు అందించేందుకు డా.సురెండర్ ఐ స్పెషలిస్ట్ మరియు రవీందర్ ఐ గ్లాసెస్ వారు సహకారం అందించారు.ఈ సందర్భంగా సీఐ రాజ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, వాహనం నడిపే ప్రతి డ్రైవర్ కంటి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం అత్యంత అవసరమని, రోడ్డు ప్రమాదాల నివారణలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది మరియు స్థానిక వాహనదారులు పాల్గొన్నారు.