పౌష్టికాహారమే పసిపిల్లలకు,బాలింతలకు శ్రీరామరక్ష
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వం గర్భిణులు,బాలింతలు,పిల్లలకు అందజేస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని రేగొండ ఎమ్మార్వో శ్వేత రావు,డిడబ్ల్యూఓ మల్లీశ్వరి అన్నారు. పోషణ్మాసం సెప్టెంబర్ 17 అక్టోబర్ 16 వరకు కార్యక్రమంలో భాగంగా సోమవారం రేగొండ మండలం రైతు వేదికలో ఐసిడిఎస్ రేగొండ సెక్టర్ సూపర్వైజర్ సంధ్య,కొడవటంచ సెక్టార్ సూపర్వైజర్ సుజాత ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్వో శ్వేత రావు,డిడబ్ల్యూఓ మల్లీశ్వరి పాల్గొని కార్యక్రమంలో ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి కుటుంబం సరైన పోషకాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమో పలు సూచనలు చేశారు.అలాగే గర్భిణీలకు,చిన్నారులకు సరైన ఆహారం అందించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు.గ్రామాల్లో పోషణ లోపం లేని గర్భిణీ స్త్రీలు బాలింతలు పిల్లలను తయారు చేయాలని అంగన్వాడి టీచర్లకు తగు సూచనలు చేశారు.ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని సూచించారు.మహిళలు అనేక రంగాల్లో ముందున్నప్పటికీ గాను ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని అధిగమించి ముందుకు వెళ్లే దిశగా ఉండాలని అన్నారు.బాల్య వివాహాలను అరికట్టాలని సఖి మరియు అంగన్వాడి కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు.గర్భిణీలు బాలింతలు తీసుకునే పోషకాహారం పై అవగాహన కల్పించారు.అనంతరం పలువురూ పిల్లలకు అక్షరాభ్యాసం చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు,తల్లులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.