పౌష్టిక ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం
పౌష్టిక ఆహారం ప్రతీ రోజు తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు.శుక్రవారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐ. డి.ఓ.సి లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ తో కలిసి ముఖ్య అతిథిగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు హాజరైనారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోషక విలువలు కలిగిన ఆకు కూరలు,పప్పు దినుసులు క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని సూచించారు.గర్భిణిలు,బాలింతలు, కిషోర బాలికలు ఐ.సి.డి.ఎస్ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామీణులకు ఐ.సి.డి.ఎస్ సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు ఉంటాయని సిబ్బందిని హెచ్చరించారు.అనంతరం చిన్నారులకు అన్నప్రాసన,అక్షరబ్యాసం చేయించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ, అడిషనల్ కలెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి,నవీన్ రెడ్డి,డి.డబ్ల్యూ.ఓ మల్లీశ్వరి,అంగన్వాడీ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు.