ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
పర్వతగిరి మండలంలోని పర్వతగిరి, కల్లెడ, చింత నెక్కొండ, ఏనుగల్లు గ్రామాల్లో ప్రజలు రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడానికి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మామునూరు ఏసిపి ఎన్. వెంకటేష్, పర్వతగిరి సీఐ బి. రాజగోపాల్, ఎస్సై బి. ప్రవీణ్, ఇతర అధికారులు మరియు సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.