ప్రజల తీర్పును గౌరవిస్తున్నా-గెలుపు ఓటమిలు సహజం-బషీర్
అభివృద్ధి పథంలో గ్రామాన్ని ముందుకు తీసుకు పోవాలన్న ఆకాంక్ష
సర్పంచ్ గా గెలిచిన అన్నం స్వప్నరాణీ బ్రహ్మా రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన బషీర్
జనగామ జిల్లా జఫర్ఘఢ్ మండలం తమ్మడపల్లి జి గ్రామంలో గురువారం జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నం బ్రహ్మా రెడ్డి భార్య స్వప్న రాణి విజయం సాధించారు.ఈ సందర్భంగా ఓడిపోయిన బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బషీర్ మీడియాతో మాట్లాడుతూ..గెలుపు ఓటమిలనేవి సహజమని,ప్రజల తీర్పును తాను శిరసావహించి గౌరవిస్తున్నట్లు స్పష్టం చేశారు.విజేతలైన అన్నం స్వప్నరాణి–బ్రహ్మారెడ్డి దంపతులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.గ్రామంలోని ప్రతి వర్గాన్ని,ప్రతి కుటుంబాన్ని కలుపుకుని పార్టీలకు అతీతంగా ప్రభుత్వం నుండి అమలయ్యే సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికీ అందిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు.తాను ఓటమిని కేవలం ఎన్నికల ఫలితంగా మాత్రమే చూస్తున్నానని,గ్రామ సేవకు అడ్డంకి కాదని స్పష్టం చేశారు.“ఎన్నికలు పూర్తయ్యాయి.ఇప్పుడు గ్రామం,ప్రజల అభివృద్ధే ముఖ్యమని,విజేతలతో కలిసి గ్రామ ప్రయోజనాల కోసం పనిచేయడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని బషీర్ అన్నారు.గ్రామస్థులు అందరూ ఐక్యంగా ఉండి,అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు