సమాజంలో ప్రతి ఒక్కరు సేవా భావంతో ఉండాలని హ్యూమన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్, ఫౌండర్ బొడ్డపాటి దాసు, తల్లాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడిపల్లి నారాయణ అన్నారు.శనివారం తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామంలో హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ తెళ్ళూరి చిన్న ఏసు కుమార్తె తేజశ్రీ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యఅతిథి తల్లాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడిపల్లి నారాయణ విచ్చేసి 20 మంది వృద్ధులు,దివ్యాంగులు,నిరుపేదలకు వితరణ చేసిన దుప్పట్లను హ్యూమన్ రైట్స్, తల్లాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.22 సంవత్సరాలుగా తేజశ్రీ పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు సేవలందించడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మోదుగు జయరాజు, గౌరవాధ్యక్షులు ఎండి ముస్తఫా, గౌరవ సలహాదారు మునుకూరి అప్పిరెడ్డి, హ్యూమన్ రైట్స్ నేషనల్ ఉమెన్స్ వింగ్ యనముల రుక్మిణి, తేళ్లూరి నాగమణి, ఎస్ న్యూస్ శ్రీను వాసరావు, లాజరు,,భాను , నరసింహారావు,తదితరులు పాల్గొన్నారు