
ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ప్రారంభం జనగాం జిల్లా ఎంపిక
దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడమే లక్ష్యంగా రూపొందించిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని శనివారం నాడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.ఈ పథకానికి దేశ వ్యాప్తంగా 100 జిల్లాలను ఎంపిక చేయగా,తెలంగాణ రాష్ట్రం నుండి జనగాం జిల్లా ఎంపిక కావడం విశేషం.వ్యవసాయ ఉత్పత్తి పెంపు,నీటిపారుదల సౌకర్యాల విస్తరణ,రైతులకు సులభతర రుణాలు,మరియు ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయ అభివృద్ధి వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని రూపొందించారు.ప్రధానమంత్రి ప్రారంభ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని జనగాం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్,జనగాం శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి,వ్యవసాయ మరియు అనుబంధ శాఖాధికారులు,పిఎసిఎస్ చైర్మన్లు,సిఈఓలు,సంఘ సభ్యులు,ఆయిల్ ఫెడ్ అధికారులు, ఐకేపీ మహిళా సమూహాలు మరియు అన్ని మండలాల నుండి రైతులు పాల్గొన్నారు.జిల్లా ఎంపికపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ,ఈ పథకం ద్వారా తమ జీవనోపాధి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.