ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాళోజీ జయంతి వేడుకలు
ప్రజాకవి,పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా జాఫర్గడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఇ.వి.ప్రమోద్ కుమార్,ఉపాధ్యాయులు,సిబ్బంది,విద్యార్థులు కలిసి కాళోజీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.కార్యక్రమంలో మాట్లాడుతూ..ఎన్ ఎస్ ఎస్ పి.ఓ భుక్య రాజు-కాళోజీ తెలంగాణ వాగ్గేయకారుడు,స్వాతంత్ర్య సమరయోధుడు,ప్రజాకవి అని,ఆయన కవిత్వం ప్రజల సమస్యలు,సామాజిక సత్యాలను ప్రతిబింబించిందని పేర్కొన్నారు.కాళోజీ జీవితం,సాహిత్యం యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన తెలిపారు.కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు,సిబ్బంది,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.