ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ స్వయం కృషితో న్యాయ విద్యను అభ్యసించి భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రభుత్వ ప్లీడరు గా నియమకమైన బోట్ల సుధాకర్ ను మంగళవారం ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. పి ఎ సి ఎస్ చైర్మన్ విజ్జన్ రావు మాట్లాడుతూ దళిత కుటుంబంలో పుట్టి న్యాయవాదిగా అంకుటిత దీక్షతో సేవలందించే ప్రభుత్వ ప్లీడర్ స్థాయికి చేరుకోవడం ఆదర్శనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు మోడెం ఉమేశ్ గౌడ్, కాంగ్రెస్ రేగొండ టౌన్ అధ్యక్షులు రవీందర్ రెడ్ది, నాయకులు మైస భిక్షపతి, ముద్దమల్ల రఘు, మేకల భిక్షపతి, ఐలి శ్రీధర్ గౌడ్, గండి తిరుపతి, ఎండీ తాజోద్దీన్, కటకం సంపత్ , తదితరులు పాల్గొన్నారు.