ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
ఖిలా వరంగల్ మండలం 43వ డివిజన్లోని జక్కలొద్దీ రామ సురేందర్ నగర్ గుడిసెలకు ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 108/2/1 గల ప్రభుత్వ భూమిని కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆ భూమికి అక్రమంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తుండటాన్ని గుర్తించిన రామ సురేందర్ నగర్ ప్రజలు వెంటనే అక్కడికి చేరుకుని పనులను నిలిపివేయాలని కబ్జాదారులను హెచ్చరించారు.ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించడం చట్టవిరుద్ధమని,వెంటనే ఫెన్సింగ్ తొలగించాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ..ఖిలా వరంగల్ మండల తహసీల్దార్ వెంటనే ఘటన స్థలానికి వచ్చి సర్వే నిర్వహించి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు.ప్రభుత్వ భూమి అక్రమ కబ్జాల బారిన పడకుండా తమ న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామని రామ సురేందర్ నగర్ ప్రజలు స్పష్టం చేశారు.