ప్రమాదానికి గురైన విద్యార్థిని వెన్నెలకు న్యాయం చేసిన బిట్స్ కాలేజీ యాజమాన్యం
Uncategorizedప్రమాదానికి గురైన విద్యార్థిని వెన్నెలకు న్యాయం చేసిన బిట్స్ కాలేజీ యాజమాన్యం అభినందనీయమని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం బిట్స్ కాలేజీ లో చదువుచున్న విద్యార్థిని వెన్నెల బెంగుళూరులోని స్టవ్ క్రాఫ్ట్ కంపెనీలో ఇంటర్నిషిష్ కు చేరడం జరిగింది. కంపెనీ విధుల్లో వున్న వెన్నెల అకస్మాత్తుగా ప్రమాదానికి గురై తన కుడి చేతి యొక్క మూడు వేళ్ళు కట్ అయ్యాయి. బిట్స్ కాలేజీ యాజమాన్యం ఇంటర్నిషిష్ కు పంపే విద్యార్థుల పట్ల జాగ్రత్తలు తీసుకోలేదని ప్రమాదానికి గురైన విద్యార్థిని వెన్నెల తల్లిదండ్రులు, ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక, MRPS, జైభీమ్ ఆర్మీ లు కలసి చిన్నటేకూర్ నందు గల బిట్స్ కాలేజీ ముందు 15.7.2025 వ తేదీన ధర్నా చేపట్టారు. ధర్నా అనంతరం కాలేజీ యాజమాన్యం మహిళా ఐక్య వేదిక, MRPS, జైభీమ్ ఆర్మీ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి విద్యార్థిని వెన్నెలకు న్యాయం చేస్తామని తెలిపారు. సంఘాల డిమాండ్ల ప్రకారం
- విద్యార్థిని వెన్నెలకు 7,50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని,
- విద్యార్థిని వెన్నెలకు ఇంటర్నిషిష్ కు వెళ్ళిన కంపెనీలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని
- విద్యార్థిని వెన్నెలకు సర్జరీ చేయించి చికిత్స ఖర్చు బిట్స్ కాలేజీ యాజమాన్యం పెట్టుకుంటామని
- బిట్స్ కాలేజీ లో చదువు పూర్తి చేసేవరకు విద్యార్థిని వెన్నెల నుండి ఏలాంటి ఫీజులు వసూలు చేయమని ఒప్పందం.
పై డిమాండ్లు అన్నింటిని ఒప్పుకుని ఈ దినం మొదటి దఫాలుగా 2,50,000 రూపాయల చెక్కును వెన్నెల కు అందించిన బిట్స్ కాలేజీ యాజమాన్యం. విద్యార్థిని వెన్నెల ప్రమాద సంఘటన పట్ల సానుకూలంగా స్పందించిన బిట్స్ కాలేజీ యాజమాన్యం వారికి ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక అభినందనలు తెలిపారు.