
బాధితునికి పరామర్శ, ఆర్థిక సాయం చేసిన ప్యాక్స్ చైర్మన్ కరుణాకర్ రావు
ఈ69న్యూస్:-జనగామ జిల్లా జఫర్గడ్ మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన గబ్బెట దేవాదాస్ కుమారుడు కుమార్ రోడ్డు ప్రమాదంలో గాయపడి హన్మకొండలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసిన జఫర్గడ్ ప్యాక్స్ చైర్మన్ తీగల కరుణాకర్ రావు హాస్పటల్కి వెళ్లి పరామర్శించి,రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.కుటుంబాన్ని ధైర్యపరిచారు.కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు, గబ్బెట శివయ్య తదితరులు పాల్గొన్నారు.