బాధిత కుటుంబానికి అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ సహాయం
హ్యుమానిటీ ఫస్ట్ ఆధ్వర్యంలో అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి గృహోపకరణాల అందజేత
అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కుటుంబానికి మానవతా సేవ
కులమతాలకు అతీతంగా బాధిత కుటుంబానికి హ్యుమానిటీ ఫస్ట్ చేయూత
బాధిత కుటుంబానికి అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ సహాయం
అగ్నిప్రమాద బాధితులకు మానవ సేవే ఇస్లాం సందేశం
గ్రామంలో మానవతా హృదయాన్ని చాటిన హ్యుమానిటీ ఫస్ట్ సేవలు అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీకి చెందిన“హ్యుమానిటీ ఫస్ట్”శాఖ ఆధ్వర్యంలో మొవ్వ మండలంలోని భట్లపెనుమర్రు గ్రామానికి చెందిన చదువుల లక్ష్మి కుటుంబానికి ఉచితంగా గృహోపకరణాలు అందజేశారు.నెల రోజుల క్రితం వారి ఇల్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా కాలిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి మానవతా దృక్పథంతో సహాయం అందించారు.ఈ సందర్భంగా హ్యుమానిటీ ఫస్ట్ శాఖ ఇన్చార్జి షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతూ..హ్యుమానిటీ ఫస్ట్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లో సేవలను విస్తరించి ఉందని,1995లో హజ్రత్ మిర్జా తాహిర్ అహ్మద్ ఈ సంస్థను స్థాపించారని తెలిపారు.ప్రకృతి వైపరీత్యాలు,ప్రమాదాలు వంటి విపత్తుల సమయంలో కులమతాలకు అతీతంగా బాధితులను ఆదుకోవడమే తమ ముఖ్య లక్ష్యమని అన్నారు.కృష్ణాజిల్లా ఇన్చార్జి మహమ్మద్ యాకుబ్ పాషా మాట్లాడుతూ..అహ్మదీయ ముస్లిం సంఘాన్ని 1889లో హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ గారు పంజాబ్ రాష్ట్రంలోని ఖాదియాన్ పట్టణంలో స్థాపించారని తెలిపారు.ఇస్లాం మీద ఉన్న అపోహలను తొలగించి నిజమైన ఇస్లాం సందేశాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ సంఘం ముఖ్య ఉద్దేశమన్నారు.ఇస్లాంలో మానవ సేవలకు అత్యంత ప్రాముఖ్యత ఉందని,దైవ హక్కులతో పాటు దైవప్రాణుల హక్కులను కూడా చెల్లించేవారే నిజమైన ముస్లింలని హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేర్కొన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో భట్లపెనుమర్రు ముస్లిం కమ్యూనిటీ అధ్యక్షుడు షేక్ మౌలాలి,గ్రామ పెద్దలు కొండేటి చంద్రశేఖర్,సురేష్ బాబు,షేక్ షరీఫ్,మీరావలీ,నాగూర్ బాబు,నాసిర్ సాబ్ తదితరులు పాల్గొన్నారు.