బిఆర్ఎస్ అభ్యర్థి గడ్డం రఘువంశి ఎన్నికల ప్రచారం
హనుమకొండ జిల్లా అయినవోలు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గడ్డం రఘువంశి గ్రామంలోని ప్రతి వాడ, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రచారాన్ని విశృతంగా నిర్వహిస్తున్నారు.
తన ప్రచారంలో భాగంగా రఘువంశి— బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అమ్మోఱీ–అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు గురించి ప్రజలకు వివరించారు. గత సంవత్సరాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను స్పష్టంగా వివరించి, వాటిని కొనసాగించాలంటే బిఆర్ఎస్కు మద్దతు అవసరమని గ్రామస్తులను కోరారు.
తాను విద్యావంతుడిగా, గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డానని రఘువంశి తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.
అంతేకాక, గ్రామ ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని రఘువంశి కోరారు