బిఆర్ స్ పార్టీ తో నే గ్రామాల అభివృద్ధి
మహబూబాబాద్ జిల్లా తొర్రురు మండలం లోని మాటేడు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నాగారాబోయిన సునీల్ యాదవ్ బ్యాట్ గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, 7వ వార్డు సభ్యులు దికొండ సుధాకర్ గౌడ్ గ్యాస్ పొయ్యి గుర్తు కు ఓటు వేసి భారీ మెజారిటీ ఇవ్వాలి అని తెలిపారు, గ్రామ లోని అన్ని వార్డు లను బిఆర్ స్ పార్టీ గెలిపించుకోవాలి అని పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యకర్తలకు,ప్రజలకు పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మాటేడు గ్రామంలో ఏర్పాటుచేసిన పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..సాధ్యం కానీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని అన్నారు.ఓట్లకోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎన్నికల్లో ఇచ్చిన హామీలేమయ్యాయని నిలదీయాలన్నారు.బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు