బిజెపి భరోసా యాత్ర గడప గడపకు ప్రచారం లో చందుపట్ల కీర్తి రెడ్డి
రేగొండ మండలం అద్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి గారి అధ్వర్యంలో పోనగండ్ల మడ్తపల్లి కొడవటంచ జోగయ్యపల్లి గ్రామంలో గడప గడపకు ప్రచారం లో పాల్గొని భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గా మీ ఇంటి ముందుకు వచ్చాను ఆశీర్వదించండి మీకు రుణపడి ఉంటాను అని హామీ ఇచ్చారు అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ మ్యానిఫెస్టోలో ప్రతి పేదవారికి రైతులకు యువతకు మహిళలకూ అనుకూలంగా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో కోడవటంచ గ్రామం లో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆశీస్సులు మరియు మీ ఆశీస్సులు ఉంటే తప్పకుండా కోడవటంచ గ్రామం లో ఉన్న ఆలయ డెవలప్మెంట్ మరియు టూరిస్ట్ ప్లేస్ గా కోడవటంచ గ్రామంకూ గుర్తింపు తీసుకొస్తాను అని కీర్తి రెడ్డి హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం కొనసాగించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇంచార్జీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు