బి ఆర్ స్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం
బాల్య తండా గ్రామ బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి జర్పల కాలు నాయక్
వెంకట్య తండా బిఆర్స్ సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ మాలి సూర్య నాయక్,
వీరారం బి ఆర్ స్ పార్టీ అభ్యర్థి గుండె రాములు బాల్య తండా లో తిరిగి గులాబీ జెండాను ఎగురేస్తామని బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి జరుపుల కాలు నాయక్ అన్నారు. వెంకట్య తండా బి ఆర్ స్ అభ్యర్థి గుగులోత్ మాలి సూర్య నాయక్, వీరారం బి ఆర్ స్ పార్టీ అభ్యర్థి గుండె రాములు నామినేషన్ దాకలు చేసారు,ఈ సందర్భంగా కాలు నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ రుణపడి ఉంటానన్నారు. ఆయన నమ్మకాన్ని వమ్ముచేయకుండా తన శాయశక్తుల గ్రామాభివృద్ధికి తోడ్పడతాననని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని గుర్తు చేశారు,అనంతరం వెంకట్య తండా బీఆర్ఎన్ పార్టీ అభ్యర్థి గుగులోత్ మాలి సూర్య నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి శరవేగంగా జరిగిందన్నారు.రైతాంగాన్ని మన బి ఆర్ స్ పాలకులే ఆదుకున్నారన్నారు. వీరారం బి ఆర్ స్ పార్టీ అభ్యర్థి గుండె రాములు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం పేరిట రైతుల ని ఆగం చేసారు అన్నారు, యూరియా కోసం రైతులు పడని తిప్పలు లేవని వారు అన్నారు,
ఈ సందర్బంగా అభ్యర్థులు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధి కోసం ఆర్నిశలు కృషి చేస్తామని తమను భారీ మెజారిటీతో సర్పంచ్ గా గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు నామినేషన్ వేసేందుకు తరలివచ్చిన ప్రతీ ఒక్కరికి పేరుపేరున సర్పంచ్ అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారంతా అండగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బాల్య తండా నేతలు పాపా నాయక్, వీరన్న, లచ్చు, బాలు, హరి నాయక్, వెంకట్య తండా బి ఆర్ స్ నాయకులు వినయ్, లింగ నాయక్, దుప్ సింగ్ నాయక్, రమేష్, కన్నా, రత్న, మంగు, వీరారం గ్రామ బి ఆర్ స్ నాయకులు మామిడాల మునిష్, బొల్లం నర్సయ్య, దుస్సా నర్సీయ్య, చింతల లింగయ్య, ఎర్పుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.