బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు
జనగామ జిల్లా నర్మెట మండలం కన్నెబోయినగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్,బీజేపీ నేతలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.శనివారం జనగామ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో వీరి పార్టీలో చేరిక కార్యక్రమం ఘనంగా జరిగింది.బీఆర్ఎస్లో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మడికంటి రాజయ్య,గౌడ సంఘం నాయకులు జంగోని కర్ణాకర్,బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు దారావత్ రాములు,గ్రామ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ దారావత్ జయరాం,కాంగ్రెస్ నాయకులు రాజబోయిన యాకయ్య,ముదిరాజ్ యూత్ అధ్యక్షుడు దిండిగాలా కర్ణాకర్,గ్రామ యూత్ ఉపాధ్యక్షుడు గుడిపెల్లి సదేశ్,అలాగే బానోత్ సతీష్,బానోత్ శ్రీనివాస్,గుడిపెల్లి యాదగిరి,కాటబోయిన గోవర్ధన్ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కంతి రాజలింగం,మాజీ ఎంపీటీసీ బిక్షపతి,గ్రామ శాఖ అధ్యక్షుడు ఉచ్చంతల లక్ష్మీనారాయణ,బైరగోని శ్రీనివాస్,బానోతు రమేష్,మహమ్మద్ యాకుబ్ పాషా,క్రాంతి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వల్లే ఇతర పార్టీల నాయకులు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు.గ్రామ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.