ఈ సందర్భంగా గ్రామంలోని పార్టీకార్యకర్తలు, మహిళలు డప్పు చప్పుళ్లతో కొలటాలాతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారుగుర్తుకు ఓటువేయాలని కోరారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్‌ను మూడోసారి కూడా ముఖ్యమంత్రి కావాలని, ప్రజల ఆశీర్వాదం కోరుతున్నట్లు తెలిపారు.
ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు మరింత లబ్ధ్ది చేకూరేవిధంగా ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారని, దాని వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్‌ను మూడోసారి కూడా ముఖ్యమంత్రి కావాలని, ప్రజల ఆశీర్వాదం కోరుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన మ్యానిఫెస్టోతో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ ఫలం అందుతుందని తెలిపారు.
ఇక్కడి  కాంగ్రెస్స్ పార్టీ అభ్యర్డి అవగాహన రాహిత్యంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కనబడుతలేదా అని ప్రశ్నించారు. మేము చేసిన పనులు కాంగ్రెస్ వచ్చిన తరువాత చేస్తామని చెప్పడం వారికే చెల్లిందన్నారు. నియోజవర్గానికి అందుకే కాపాడుకునే బాధ్యత నాది. బిజేపి పార్టీ కిడిపాజిట్ కూడా రాదు, వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు చాలన్న రేవంత్‌రెడ్డిని, వారి అభ్యర్థులను తెలంగాణ నుంచి తరిమేందు కు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కెసీఆర్  సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు రక్ష..
 ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఎత్తులు వేసిన చివరికి వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎగిరేది గులాబీ జెండా మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు.
అభివృద్ధి చేసిన కారుగుర్తు కు ఓటు వేసి తనను మరోసారి ఆశీర్వదించాలని కోరడం జరిగింది…
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు