
బీజేపీ పాలనలో మహిళల హక్కులు హరించబడ్డాయి – మల్లు లక్ష్మి
ఈ69న్యూస్ జనగామ:-బీజేపీ పాలనలో మహిళల సాధించిన హక్కులు ఖండితంగా హరించబడ్డాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (AIDWA) రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి విమర్శించారు. జనగామలో పూలే–అంబేద్కర్ స్ఫూర్తితో నిర్వహించిన మహిళా హక్కుల పరిరక్షణ యాత్రలో ఆమె ప్రసంగించారు.సమావేశంలో మల్లు లక్ష్మి,అరుణజ్యోతి,బుగ్గవేటి సరళ తదితరులు మాట్లాడారు.మహిళలపై హింస,అత్యాచారాలు పెరుగుతున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినా,అమలు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు.చిట్యాల ఐలమ్మ వంటి పోరాట వీరుల స్ఫూర్తితో మహిళలు చైతన్యవంతంగా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.