బెరువాడ శివారు బోడమంచ్యా తండాలో హత్య
జిల్లా,కేసముద్రం మండలం బెరువాడ గ్రామ శివారులోని బోడమంచ్యా తండాలో భూక్య వీరన్న అనే వ్యక్తి హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది.ఈ ఘటనతో తండాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.మృతుడి బంధువులు,స్థానికులు ఆగ్రహంతో ఒక ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.శాంతిభద్రతలకు భంగం కలగకుండా ఉండేందుకు మహబూబాబాద్ జిల్లా పోలీసులు ప్రత్యేక బలగాలను సంఘటనా స్థలానికి పంపించారు.ప్రస్తుతం గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి,పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు,నిందితులను త్వరలోనే గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.