బొగ్గు గని పైకప్పు కూలిన ఘటనలో ముగ్గురు సింగరేణి కార్మికులు మృతి
ప్రమాదంలో మరణించిన సింగరేణి కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి, ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క
ముందస్తు ఎలక్షన్ కోసం ఉచిత హామీలు ఇవ్వడం కాదు, అమలు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క
ఈరోజున హైదరాబాద్ నందు గల అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే దనసరి సీతక్క మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్ అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో బొగ్గు గని పైకప్పు కూలిన ఘటనలో ముగ్గురు సింగరేణి కార్మికులు మృతి చెందడం అత్యంత విషాదకారం అని అన్నారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. అలాగే మన ముఖ్యమంత్రి గారు 91,142 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తా అనడం హర్షణీయమే, కానీ ఆ ఉద్యోగాలు ఎప్పటివరకు, ఎలా భర్తీ చేస్తారో అసెంబ్లీ సాక్షిగా పూర్తి వివరణ ఇవ్వాలని కోరారు. అలాగే ముందస్తు ఎలక్షన్ కోసం ఉచిత హామీలు ఇస్తున్న కేసీఆర్ గారు హామీలు అమలు చేసే ఉద్దేశం ఉందా అని ప్రశ్నించారు హామీలు కాదు అమలు చేయాలని సీతక్క గారు అన్నారు