రైతు సంఘం మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా
బోనకల్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ వద్ద శుక్రవారం సిపిఎం , రైతు సంఘం మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
అకాల వర్షాలు వలన పత్తి, పెసర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఈ వర్షాలు రైతుని కోలుకోలేని నష్టాన్ని కలిగించాయని ప్రభుత్వం వెంటనే స్పందించి పత్తి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, సీసీఐ ద్వారా పట్టి కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ రమాదేవికి అందజేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో దొండపాటి నాగేశ్వరరావు, బంధం శ్రీనివాసరావు, జొన్నలగడ్డ సునీత, తెల్లాకుల శ్రీనివాసరావు, బోయినపల్లి వీరబాబు, కొమ్మినేని నాగేశ్వరరావు, గుగులోతు పంతు, గుగులోతు నరేష్, ఉప్పర శ్రీను, బిల్లా విశ్వనాథం, దొండపాటి సత్యనారాయణ, నిమ్మతోట కాన, కుక్కల కోటేశ్వరరావు, నల్లమోతు నాగేశ్వరరావు, నల్లమోతు వాణి, ఏసుపోగు బాబు, పసుపులేటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.