
భర్తపై హింసకు భరించలేక భార్య ఘోర హత్య
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామంలో జరిగిన దారుణ ఘటన చోటుచేసుకుంది.కుటుంబ కలహాలు,మద్యం మత్తులో భర్త చేసిన వేధింపులు భరించలేక భార్య తన భర్తను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.వివరాల్లోకి వెళ్తే-పెద్ద పెండ్యాల గ్రామానికి చెందిన రాజారపు అశోక్ ప్రతిరోజూ మద్యం తాగి భార్య యాదలక్ష్మిపై అనుమానాలతో నానా రకాలుగా హింసించేవాడని పోలీసులు తెలిపారు.ఇక ఈ వేధింపులు భరించలేకపోయిన యాదలక్ష్మి,ఒకరోజు మద్యం మత్తులో ఉన్న భర్తను చంపాలని నిర్ణయించుకుని,తన చున్నితో అతని మెడకు ఉరి బిగించి హత్య చేసినట్లు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ ఘటనపై మీడియా సమావేశంలో ఏసిపి పింగిలి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా సహనం కోల్పోయి చంపడం కానీ,ప్రాణం తీసుకోవడం కానీ సరైన మార్గం కాదు.సమస్యలు ఉన్నప్పుడు పోలీసులను సంప్రదించాలి,చట్టపరమైన మార్గాల్లోనే న్యాయం పొందాలి అని సూచించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి,పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఏసిపి తెలిపారు.