భర్త ఇల్లిగల్ అఫైర్‌తో వేధింపులు–డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య
Uncategorized
ఈ69న్యూస్ వరంగల్:వరంగల్ నగరంలోని మట్టేవాడకు చెందిన డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో ఆమె భర్త డాక్టర్ అల్లాడి సృజన్ (కార్డియాలజిస్ట్),అతని తల్లిదండ్రులు అల్లాడి మధుసూదన్,పుణ్యవతి,అలాగే బానోతు శృతి అనే యువతిపై వరంగల్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఫిర్యాదుదారైన తంజావూరు పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం–తన కుమార్తె డాక్టర్ ప్రత్యూష (35) ఒక ప్రతిభాశాలి డెంటల్ డాక్టర్‌గా NSR హాస్పిటల్లో పని చేస్తూ ఉన్నారు. ఆమెను 2017లో డాక్టర్ అల్లాడి సృజన్‌కు వివాహం చేశారు.అప్పట్లో 30 తులాల బంగారం,ఒక కారు,రూ.30 లక్షల నగదు పణంగా ఇచ్చి వివాహం నిర్వహించినట్లు పేర్కొన్నారు.వారికి ఇద్దరు కుమార్తెలు–పెద్ద కుమార్తె జానుషా (7 సంవత్సరాలు),చిన్నది జెస్వికాస్ (7 నెలలు)–ఉన్నారు.అయితే గత 8 నెలలుగా డాక్టర్ సృజన్,బానోతు శృతితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ,భార్య ప్రత్యూషను శారీరకంగా,మానసికంగా వేధించేవాడని ఫిర్యాదులో తెలిపింది.అతడి అక్రమ సంబంధం గురించి ప్రశ్నించిన సమయంలో ఆమెపై దాడులకు పాల్పడినట్లు పేర్కొంది.ఈ విషయాన్ని అత్తమామలైన మధుసూదన్,పుణ్యవతికి చెప్పినప్పటికీ,వారు తన కుమారుడిని మందలించకుండా ప్రత్యూషని చంపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.అంతేకాక బానోతు శృతి కూడా ప్రత్యూషకు ఫోన్ చేసి బెదిరించినట్లు వెల్లడించారు.ఈ దుస్థితిలో తీవ్ర మనోవేదనకు లోనైన డాక్టర్ ప్రత్యూష,తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని తల్లి పద్మావతి కన్నీటి కథనం వెల్లడించారు.కూతురు మరణానికి కారణమైన నలుగురిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.పద్మావతి ఫిర్యాదు ఆధారంగా వరంగల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.