భవన నిర్మాణ కార్మికుల బీమా
Galam Telugu E Paper, Galam Telugu E Paper, Hanamkonda, Telangana, TELUGU NEWS, Warangalభవన నిర్మాణ కార్మికులకు పెంచిన ప్రమాద బీమా రూ.10 లక్షలు తప్పనిసరిగా ప్రభుత్వ వెల్ఫేర్ బోర్డు ద్వారానే ఇవ్వాలని,ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగిస్తే తీవ్ర ఉద్యమం చేపడతామని సిఐటియు,బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నేతలు హెచ్చరించారు.ఉర్సుగుట్ట రోడ్డు లోని రామ సురేందర్ భవన్లో మంగళవారం జరిగిన జిల్లా మహాసభలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు వంగూరు రాములు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.కోటరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.వారు మాట్లాడుతూ…కార్మికులు పోరాటాలతో సాధించుకున్న చట్టాలను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.కార్మికుల కోసం సెస్ ద్వారా వచ్చిన వేల కోట్లు వేరే దారికి మళ్లిస్తున్నారని ఆరోపించారు.నూతన ఆర్థిక విధానాల తర్వాత కార్మికులకు పని దొరకడమే కష్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు.నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కార్మికుల కోసం అడ్డాలలో మౌలిక వసతులు,ఇందిరమ్మ ఇళ్ళు,పిల్లల చదువులకు రాయితీలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.వెల్ఫేర్ బోర్డు నిధులు పూర్తిగా కార్మిక సంక్షేమానికి మాత్రమే వినియోగించాలన్నారు.ఈ సందర్భంగా 25 మందితో నూతన జిల్లా కమిటీను ఎన్నుకున్నారు.అధ్యక్షుడు-బోల్ల కొమురయ్య.ప్రధాన కార్యదర్శి-ఆరూరి కుమార్.కోశాధికారి-తోగిటి బ్రహ్మచారి.ఉపాధ్యక్షులు-పోలే బోయిన శ్రీనివాస్,సుంకరి బిక్షపతి,క్యాతం మొగిలి.సహాయ కార్యదర్శులు-లక్క నరేష్,బి.సంపత్,కందికొండ రాజు,మేకల కరుణాకర్,నమిన్ల కుమారస్వామి,దుప్పటి బాబు,చిర్ర సంపత్.ఈ మహాసభ ప్రారంభానికి ముందు సంఘం జెండాను ఆవిష్కరించారు.సభను బోల్ల కొమురయ్య అధ్యక్షతన నిర్వహించారు.కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎండి బషీర్,జిల్లా కమిటీ సభ్యులు గున్నాల ప్రభాకర్,ఉపేందర్,పొడిశెట్టి కుమార్,జానీ,అఖిల్ తదితరులు పాల్గొన్నారు.