
భాజపా మండల స్థాయి సమావేశం విజయవంతం
జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశం ఘనంగా జరిగింది.మండల అధ్యక్షులు కోరుకొప్పుల నాగేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై,సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నుండి నాయకులు భాజపాలో చేరారు.వారికి కండువా కప్పి పార్టీ నేతలు గౌరవంగా ఆహ్వానించారు.కొత్తగా పార్టీలో చేరిన నేతలతో భాజపా మండల స్థాయిలో బలోపేతం దిశగా ముందడుగు వేసినట్లు నాయకులు తెలిపారు.జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ మాట్లాడుతూ..భాజపాలో చేరడం ప్రతి ఒక్కరికి గర్వకారణం.ఇప్పుడు మీరు ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేయాలి.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జాఫర్గడ్ మండలాన్ని మోడల్‌గా తీర్చిదిద్దాలి అని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు ఐలోని అంజి రెడ్డి,భాగాల నవీన్ రెడ్డి,జిల్లా నాయకులు అంకుగారి శశిధర్ రెడ్డి,ఎం.డి.వలి పాష,మారపల్లి రవి,గోదారి సాయిరాం,మండల ప్రధాన కార్యదర్శులు గొలుసుల లింగా యాదవ్,అన్నేపు రమేష్,మండల కార్యదర్శి చిరబోయిన కవిత,కిసాన్ మోర్చా అధ్యక్షుడు అబ్బరబోయిన యాకస్వామి,మహిళా మోర్చా నాయకురాలు ముస్కు స్వప్న,భాజపా నాయకులు ఇల్లెందుల సారయ్య,గాదెపాక చిరంజీవి,గిరిగోని యాదగిరి,నేరెళ్ళ రాజు,కె.శివకుమార్,పొతోజు ఎల్లాచారి,తిగారపు బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.భాజపా గూటికి చేరిన వారు:ముచ్చ యాదవ రెడ్డి,గడ్డం వెంకటేశ్వర్లు,చెన్నూరి మల్లారెడ్డి,ఇల్లెందుల నరసయ్య,ఇల్లెందుల ఎల్లయ్య,కోట ఎల్లయ్య,బెల్లి పెద్దన్న,చేగొండ పెద్దన్న,ఇల్లెందుల చిన్న కొమురయ్య,బేతి రాజమౌళి,ఇల్లెందుల ఏలియా,ఇల్లెందుల వెంకటయ్య,తీగారపు సమ్మయ్య,ఇల్లెందుల ప్రమోద్,ఇల్లెందుల చిన్న ఎల్లయ్య,ఇల్లెందుల నాగరాజు,బేతి మార్కండేయ,బుల్లె యాదగిరి పెద్ద.కార్యక్రమం ముగింపు సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..జాఫర్గడ్ మండలంలో భాజపా కార్యకలాపాలు వేగవంతమవుతున్నాయని,త్వరలోనే పార్టీ గ్రామస్థాయిలో కూడా మరింత బలపడుతుందని తెలిపారు.