భారీ బహిరంగ సభ, ప్రజా ప్రదర్శన జయప్రదం చేయండి
ఈనెల 18వ తేదీన ఖమ్మంలో జరగబోయే భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 100 వసంతాల శతజయంతి ఉత్సవాల ముగింపు బహిరంగ సభ గోడపత్రికలను మంగళవారం సత్తుపల్లి పట్టణంలోని, వివిధ ఆటోల అడ్డాల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.. ఏఐటియుసి ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మటూరి రామకృష్ణ మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు పార్టీ భారత గడ్డపై పుట్టి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. నాటి నుండి నేటి వరకు పేద బలహీన వర్గాల కార్మిక. కర్చక. రైతు వారి సమస్యల కోసం నిరంతరం శ్రమిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల ఉత్సవంలో పాల్గొనటం కార్మికులు అదృష్టంగా భావించాలన్నారు.అలాగే ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మరియు భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వం అందరూ ఖమ్మం పట్టణంలో జరిగి బహిరంగ సభకు 45 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు కనుక కార్మిక లోకం పెద్ద ఎత్తున కదిలి ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో: ఆటో వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అడ్డా అధ్యక్షులు చిల్లగొండ్ల కాశీ రావు, ప్రసాద్ సింగ్ పరస వెంకన్న, తడకం మల్ల హరిబాబు సూరిబాబు, గరికంటి అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.