ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచన
తెలుగు గళం హన్మకొండ న్యూస్
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. వచ్చే రెండు మూడు రోజులు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు. ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ, ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలాలని, రైతులు తమ పంటలు తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షకాలంలో చెట్ల కింద, పాడైన లేదా శిధిలమైన భవనాల కింద ఉండకూడదని హెచ్చరించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు విద్యుత్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, కరెంటు స్థంభాలు, ట్రాన్సాఫార్మర్లు తాకరాదని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని ప్రజలను కోరారు. వాగులు, కాలువలు, చెరువులు, నదులు, రిజర్వాయర్ల సమీపానికి వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. ముంపు లేదా వరద ప్రాంతాల్లో ఉన్న దాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రైతులకుసూచించారు.అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ పరిస్థితులను నిరంతరంగా పర్యవేక్షించాలనని ఎమ్మెల్యే ఆదేశించారు. సంబంధిత ప్రభుత్వ శాఖలు, రక్షణ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కంట్రోల్ రూమ్ టోల్‌ఫ్రీ నంబర్ 9052308621కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.