వర్షాల ప్రభావంతో రైల్వే రాకపోకలకు అంతరాయం
తెలుగు గళం న్యూస్ డెస్క్,అక్టోబర్ 29
దక్షిణ భారత రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో రైల్వే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.విజయవాడ మీదుగా తిరుపతి,తమిళనాడు,కేరళ వైపు వెళ్లాల్సిన పలు రైళ్లను రైల్వే అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా మార్గం మళ్లించారు.ఈ రైళ్లు తాత్కాలికంగా హైదరాబాద్ మార్గం ద్వారా నడిపించబడుతున్నాయి.రైల్వే అధికారులు ప్రయాణికులు బయలుదేరే ముందు సంబంధిత రైళ్ల తాజా సమాచారం కోసం రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.