తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి,సంక్షేమం జోడెద్దుల్లా ముందుకు సాగేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.భూపాలపల్లి నియోజకవర్గంలోని మంజూర్నగర్,ధర్మారావుపేట,నవాబుపేట ప్రాంతాల్లో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల శంఖుస్థాపన కార్యక్రమాలు సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్లు భట్టి విక్రమార్కతో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ కడియం కావ్య హాజరై, ప్రజలనుద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ…ఇండ్లు లేని నిరుపేదలకు నివాస గృహాలు కల్పించడం, యువతకు ఉద్యోగావకాశాలు అందించడం, ఆర్థికంగా ప్రతి ఒక్కరిని ఎదగనివ్వడమే మా పాలన లక్ష్యం. రాష్ట్రం సంపాదించే ప్రతి రూపాయి పేదల కోసమే వినియోగిస్తున్నాం. కానీ గత బీఆర్ఎస్ పాలనలో వనరులు వృథా అయ్యాయి, ప్రజల సొమ్మును కొందరు పాలకులు దోచుకున్నారు,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణం వల్ల గ్రామాల్లో విద్యుత్ సరఫరా మెరుగవుతుందని,వ్యవసాయం,పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తుందని ఆయన తెలిపారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో మండల ప్రజాప్రతినిధులు,అధికారులు,రైతులు,గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.