భూపాలపల్లి నియోజకవర్గంలో ఎస్సైల బదిలీలు
కాళేశ్వరం జోన్ పరిధిలోని పోలీస్ శాఖలో పరిపాలనా కారణాలతో పలు సబ్ఇన్స్పెక్టర్ల (ఎస్సైలు) బదిలీలు,కొత్త నియామకాలు చేపట్టినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.రామగుండం కమిషనరేట్ పరిధిలోని జోన్–1 కాళేశ్వరం నుండి జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ బదిలీలు అమల్లోకి వచ్చినట్లు తెలిపారు.ఉత్తర్వుల ప్రకారం మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్‌హెచ్‌వోగా పనిచేస్తున్న బి. అశోక్‌ను ఘనపూర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.టేకుమట్ల పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా ఉన్న డి. సుధాకర్‌ను రేగొండ పోలీస్ స్టేషన్ ఎస్సైగా నియమించారు.చిట్యాల పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా పనిచేస్తున్న జి. శ్రావణ్ కుమార్‌ను భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ–2గా నియమించారు.అలాగే భూపాలపల్లి జాయింట్ సూపరింటెండెంట్ కార్యాలయంలో వీఆర్‌లో ఉన్న ఎస్.సాయి త్రిలోక్‌నాథ్ రెడ్డిని కోతపల్లి గోరి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా నియమించారు.అదే విధంగా వీఆర్‌లో ఉన్న పి. సతీష్‌ను చిట్యాల పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా నియమించారు.ములుగు జిల్లాలో వీఆర్‌లో ఉన్న ఎం. సురేష్‌ను మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా నియమించారు.భూపాలపల్లి జాయింట్ సూపరింటెండెంట్ కార్యాలయంలో వీఆర్‌లో ఉన్న జి. అమూల్యను టేకుమట్ల పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా నియమించారు.ఘనపూర్ (ఎం) పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా పనిచేస్తున్న ఆర్. అశోక్‌ను భూపాలపల్లి జాయింట్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వీఆర్‌కు పంపించారు.కోతపల్లి గోరి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా ఉన్న ఎస్. దివ్యను కూడా భూపాలపల్లి జాయింట్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వీఆర్‌కు బదిలీ చేశారు.ఈ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయబడినట్లు అధికారులు తెలిపారు.అలాగే భూపాలపల్లి,ములుగు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్లు ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.